Home > తెలంగాణ > చేప మందు పంపిణీ.. బత్తిని హరినాథ్‌ గౌడ్ ఇక లేరు

చేప మందు పంపిణీ.. బత్తిని హరినాథ్‌ గౌడ్ ఇక లేరు

చేప మందు పంపిణీ.. బత్తిని హరినాథ్‌ గౌడ్ ఇక లేరు
X

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో హరినాథ్ గౌడ్ ప్రతి ఏడాది చేప మందు పంపిణీ చేసేవారు. ఆస్తమా , దగ్గు, శ్వాస సంబధిత వ్యాధులలతో బాధపడే లక్షలాది మంది ఈయన ఇచ్చే చేప ప్రసాదాన్ని స్వీకరించారు.





ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేసేవారు బత్తిన సోదరులు. అంతకుముందు కరోనా కారణంగా మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. ఈ ఏడాది మే లో చేప ప్రసాదం పంపిణీ చేశారు అన్నదమ్ములు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే ఈ కార్యక్రామానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చేది. ఈ చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వచ్చేవారు. వారికి ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకునేది.




Updated : 24 Aug 2023 7:27 AM IST
Tags:    
Next Story
Share it
Top