Harish Rao: కాంగ్రెస్ బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా?: హరీష్ రావు
X
తెలంగాణ వచ్చాకే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. రైతుల కష్టాలు తీరుతున్నాయన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసమని.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. నర్సాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని హరీష్ రావు చెప్పారు. మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత తనదని హమీ ఇచ్చారు. కర్ణాటకలో కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తున్నారని బీఆర్ఎస్ నేతలంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. నిన్న డీకే శివకుమార్ వచ్చిన అక్కడ 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిజాలు బయటపెట్టారని హరీష్ విమర్శించారు. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిందని, ఈ విషయంలో డీకే శివకుమార్ కు థ్యాంక్స్ చెప్పాలని ఎద్దేవా చేశారు.
కర్నాటకలో కరెంట్ సరఫరా చూసేందుకు తమకు కాంగ్రెస్ పార్టీ బస్సు ఏర్పాటు చేస్తానంది. డీకే మాటలు విన్నాక ఇంక మాకు బస్సెందుకని హరీష్ రావు ఆరోపించారు. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్. రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదని మండిపడ్డారు. ‘‘రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటుంటే.. డీకే శివకుమార్ వచ్చి ఐదు గంటల కరెంట్ ఇస్తుంటున్నారు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. తస్మాత్ జాగ్రత్త…మోసపోతే గోస పడుతాం. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ కు ఓటెయ్యడు. కాంగ్రెస్ కు ఓటేస్తే మన కళ్లళ్ల మనం పొడుచుకున్నట్లే. కాంగ్రెస్ వాళ్లవి తిట్లు.. బీఆర్ఎస్ పార్టీవి కిట్లు. కాంగ్రెస్ బూతులు కావాలా.. తెలంగాణ భవిష్యత్తు కావాలా ప్రజలు ఆలోచించాలని’’ హరీష్ రావు పిలుపునిచ్చారు.