Home > తెలంగాణ > Harish Rao : లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపిన హరీశ్ రావు

Harish Rao : లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపిన హరీశ్ రావు

Harish Rao : లాస్య నందిత మృతి పట్ల సంతాపం తెలిపిన హరీశ్ రావు
X

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుంటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మాజీ మంత్రి హరీశ్ రావు. ప్రమాదం జరిగిన వెంటనే పటాన్ చెరు అమేధ ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లి లాస్య పార్థివ దేహనికి నివాళులర్పించారు. లాస్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడి పరిస్థితిని వారిని అడిగి తెలుసుకున్నారు. లాస్య కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తం లాస్య మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద లాస్య కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కాగా ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated : 23 Feb 2024 3:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top