Home > తెలంగాణ > విద్య, వైద్యంపైనే మా ఫోకస్..మంత్రి హరీశ్‎ రావు

విద్య, వైద్యంపైనే మా ఫోకస్..మంత్రి హరీశ్‎ రావు

విద్య, వైద్యంపైనే మా ఫోకస్..మంత్రి హరీశ్‎ రావు
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంపైనే ఫోకస్ పెట్టిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. శాసన సభ సమావేశాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖపై జరిగిన స్వల్పచర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోగ్య శాఖపై చేసిన విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.

గతంలో మాదిరిగా రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ ఎలాంటి వ్యాదులు తీవ్రంగా లేవని ఆయన వివరించారు. వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు.

శాసనసభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..‘‘గత ఐదేళ్లలో రెండుసార్లు కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల ప్రభుత్వం అనుకున్న ప్రణాళికలు అన్నీ కూడా అతలాకుతలం అయ్యాయి. కరోనా యావత్‌ ప్రపంచాన్నే వణికించేసింది. దీని కారణంగా ప్రభుత్వం అనుకున్న గార్గెట్స్ కాస్త ఆలస్యం కావొచ్చు కానీ.. విద్య, వైద్యంపైనే సర్కార్ స్పెషల్ ఫోక్స్ పెట్టి ముందుకెళ్తోంది. 2013-14లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్య శాఖకు రూ.2,706 కోట్లు మాత్రమే కేటాయించింది. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ సర్కార్ రూ.12,364 కోట్లు వైద్యారోగ్యశాఖకు కేటాయించింది. గత పదేళ్లలో వైద్య రంగంపై ప్రభుత్వం రూ.73 వేల కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, గాలి, ఆహారం అందిస్తున్నాము. మలేరియా, డెంగ్యూ వంటి అంటు వ్యాదుల తీవ్రత రాష్ట్రంలో పెద్దగా లేదు" అని అని హరీశ్‌రావు తెలిపారు.


Updated : 4 Aug 2023 3:56 PM GMT
Tags:    
Next Story
Share it
Top