Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు కౌంటర్
X
తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింత విషయంలో మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్‌రెడ్డికి లేదని హరీశ్ అన్నారు. నీళ్లు తీసుకెళ్తుంటే నేను, నాయిని నర్సింహారెడ్డి మంత్రి పదవులను గడ్డిపోసల్లా విసిరికొట్టమని ఆయన అన్నారు. తెలుగు దేశం పార్టీలో ఉండి నోరు మూసుకోని ఉన్న నువ్వా మా గురించి మాట్లాడేది అని హరీశ్‌రావు అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టలపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమని హరీష్ రావు ప్రకటించారు. కాంగ్రెస్ నేతలకు దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఆ హామీలన్నీ నేరవేర్చాకే పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఫిబ్రవరిలో గ్రూప్స్ నోటిఫికేషన్, ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.. మరీ ఫిబ్రవరి వచ్చింది హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఫిబ్రవరి వచ్చిన రైతులకు ఇంతవరకు రైతు బంధు డబ్బులు జమ కాలేదని.. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అని నిలదీశారు. కాగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం స్టేట్ పాలిటిక్స్‌లో కాకరేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రాజెక్ట్‌లను కేంద్రానికి హ్యాండోవర్ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సాగు నీటి ప్రాజెక్ట్‌లపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామని.. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు ఉమ్మడి శాసన సభ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో చర్చకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.