Harish Rao: బీజేపీ భ్రష్టు పట్టింది.. ఈసారి పరువు పోవడం ఖాయం: హరీష్ రావు
X
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ పార్టీ డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకుంటే.. పరువైనా దక్కుతుందని చురకలంటించారు మంత్రి హరీష్ రావు. సొంత రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకోలేని జేపీ నడ్డా.. తెలంగాణలో గెలిపిస్తారా? అని ఎద్దేవా చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పడ్తనపల్లిలో టీఎంసీ సామర్థ్యం ఉన్న ఎత్తిపోతల పథకానికి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన హరీష్.. బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు.
‘తెలంగాణ రాష్ట్రంలో హంగ్ కాదు.. బీఆర్ఎస్ పార్టీ హాట్రిక్ కొడుతుంది. నడ్డా.. తెలంగాణ కేసీఆర్ అడ్డా. బీఎల్ సంతోష్.. కర్నాటకలో మీ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇక్కడ కూడా ఆయన వల్ల బీజేపీ పతనం ఖాయం’ అని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కష్ట పడుతుంది. మరోసారి కేసీఆర్ ను ఆశీర్వదించి సీఎంను చేయాలని ప్రజలను కోరారు. ఇప్పటికే మండలానికి వైద్య కళాశాలను మంజూరు చేసినట్లు చెప్పుకొచ్చారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. రాష్ట్రంలో మరింత అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని అన్నారు.