Home > తెలంగాణ > గజ్వేల్ తలరాతను మార్చింది కేసీఆరే : హరీష్ రావు

గజ్వేల్ తలరాతను మార్చింది కేసీఆరే : హరీష్ రావు

గజ్వేల్ తలరాతను మార్చింది కేసీఆరే : హరీష్ రావు
X

గజ్వేల్కు ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చి వెళ్లారు కానీ.. దాని తలరాతను మార్చింది మాత్రం కేసీఆరే అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ వచ్చాక గజ్వేల్ రూపురేఖలే మారిపోయాయని చెప్పారు. ములుగులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో ములుగు రోడ్లు ఎలా ఉండేనో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ అంటే గజ్వేల్.. గజ్వేల్ అంటే కేసీఆర్ అని అన్నారు.

గజ్వేల్ నీటి కష్టాలను కేసీఆర్ తొలగించారని హరీష్ రావు చెప్పారు. నియోజకవర్గంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగిందన్నారు. జిల్లా స్థాయి ప్రభుత్వాసుపత్రితో పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలకు అభివృద్ధి గురించి మాట్లాడే ముఖం లేదన్నారు. భూములు గుంజుకుంటామని తప్పుతు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఈ సారి అధికారంలోకి వచ్చాక అసైన్డ్ భూములకు పట్టాలిస్తామని చెప్పారు. అదేవిధంగా సౌభాగ్య లక్ష్మీ ద్వారా మహిళలకు నెలకు 3వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ చేస్తున్న కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Updated : 20 Nov 2023 7:31 PM IST
Tags:    
Next Story
Share it
Top