హరీశ్‌రావుపై కేటీఆర్ ప్రశంసలు..అసెంబ్లీలో అదరగొట్టారు.. KTR Comments
X
కృష్ణా ప్రాజెక్టుల (Krishna Project) పై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాజీ మంత్రి హరీశ్ రావు అద్బుతమైన ప్రదర్శన చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. కృష్ణా జాలాలు కేఆర్ఎంబికి సంబంధించిన కాంగ్రెస్ నాయకుల తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టారని ట్వీట్ చేశారు. రేపటి ఛలో నల్గొండకు పార్టీ శ్రేణులు సిద్దంకండి అని అక్కడ మాజీ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొడతారు అని కేటీఆర్ రాసుకోచ్చారు. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌పై (KCR) వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లగొండలో బీఆర్‌ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చారని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ (CM Jagan) స్టేట్‌మెంట్ విన్నతర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నల్లగొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానమిచ్చారని చెప్పారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు.