Home > తెలంగాణ > ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయాయి : హరీష్ రావు

ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయాయి : హరీష్ రావు

ఆ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా.. బీఆర్ఎస్ గెలుపును ఆపలేకపోయాయి : హరీష్ రావు
X

కాంగ్రెస్‌, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గజ్వేల్లో బీఆర్ఎస్కు 45 వేల మెజార్టీ వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్‌ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభలో హరీష్ రావు పాల్గొన్నారు. కులాలు, మతాల మధ్య మిగితా పార్టీలు చిచ్చు పెట్టాలని చూసినా.. కార్యకర్తలు కేసీఆర్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌ రిజర్వాయర్లతో చెరువులు నింపారన్నారు.

కేటీఆర్‌ దావోస్‌కు వెళ్తే కాంగ్రెస్ నేతలు డబ్బులు దండగ అన్నారని.. కానీ ఇప్పుడు సీఎం ఎందుకు వెళ్లారో చెప్పాలని హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన నెల రోజులకే బెదిరింపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అదానీ అవినీతి వెనక ప్రధాని ఉన్నారని రాహుల్ గాంధీ అంటున్నారని.. కానీ రేవంత్ - అదానీ మాత్రం షేక్ హ్యాండులు ఇచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇందులో రాహుల్ కరెక్టా.. రేవంత్ కరెక్టా అని అడిగారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం అని కేంద్రం చెబితే.. కాంగ్రెస్ ఎందుకు కొట్లాడడం లేదని నిలదీశారు. కేంద్రం మెడలు వంచుతామన్న కాంగ్రెస్ నేతలు వాళ్ల మెడలో దండలు వేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేయాలని.. లేకపోతే మా తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు.


Updated : 18 Jan 2024 11:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top