Home > తెలంగాణ > నన్ను మాట్లాడనివ్వకుండా 8 మంది మంత్రులు అడ్డుకున్నారు : Harish Rao

నన్ను మాట్లాడనివ్వకుండా 8 మంది మంత్రులు అడ్డుకున్నారు : Harish Rao

నన్ను మాట్లాడనివ్వకుండా 8 మంది మంత్రులు అడ్డుకున్నారు : Harish Rao
X

అసెంబ్లీలో అధికార పార్టీ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పోరాటంతోనే కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో అన్నీ తప్పులే ఉన్నాయని ఆరోపించారు. తాను తప్పులను ఎత్తిచూపితే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయిందని విమర్శించారు. తనను మాట్లాడనివ్వకుండా 8మంది మంత్రులు అడ్డుకున్నారని మండిపడ్డారు.

లోక్ సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్ మేడిగడ్డ ప్రాజెక్టును భూతద్దంలో పెట్టి చూపిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. తమపై బురద జల్లాలనుకున్నా సరేగానీ.. ప్రాజెక్టును మాత్రం వానాకాలం లోపు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే రైతులకు బురదే మిగులుతుందని చెప్పారు. ఇక ఇరిగేషన్ శాఖపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేత పత్రం తప్పుల తడకగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని ఆరోపణల చేసినా... రైతులకు తాము నీళ్లు ఇచ్చింది నిజమని చెప్పారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమది ప్రజలపక్షమే అని హరీష్ రావు అన్నారు.

అంతకుముందు సీఎం తమని రెచ్చగొట్టాలని చూస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్‌ పేరును చెడగొట్టాలన్నదే రేవంత్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంపై తాము ఏ విచారణకు అయినా సిద్ధమని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించామని చెప్పారు. పోలవరంలోనూ డయాఫ్రం వాల్ కూలిపోయిందని కానీ రేవంత్ సర్కార్ మేడిగడ్డనే చూపించి బురద జల్లడం సరికాదని విమర్శించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదు కాబట్టే కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నిజాలు తెలుసుకని మాట్లాడాలని చెప్పారు.

Updated : 17 Feb 2024 4:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top