Home > తెలంగాణ > బీఆర్ఎస్ హయాంలో విచారణ చేస్తే ఎన్ని కేసులు పెట్టేవాళ్లమో : హరీష్ రావు

బీఆర్ఎస్ హయాంలో విచారణ చేస్తే ఎన్ని కేసులు పెట్టేవాళ్లమో : హరీష్ రావు

బీఆర్ఎస్ హయాంలో విచారణ చేస్తే ఎన్ని కేసులు పెట్టేవాళ్లమో : హరీష్ రావు
X

కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత సహా విభజన హామీలు సహా పలు అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వివిధ అంశాలపై కేంద్రమంత్రులను కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో ఆ రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు.

కేంద్రం తమపై ఎంత ఒత్తిడి తెచ్చిన కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను ఇవ్వడానికి ఒప్పుకోలేదని హరీష్ రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హమీల గురించి అడిగితే అసహనంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గత ప్రభుత్వ చేసిన పనులపై విచారణలు చేస్తే ఎన్నో కేసులు పెట్టి ఉండేవాళ్లమని వ్యాఖ్యానించారు. రేవంత్ సర్కార్ పాలనపై కాకుండా ప్రతిపక్షాలపైనే ఎక్కువ దృష్టి సారించిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ను సాకుగా చూపి.. హామీలను విస్మరించొద్దని హితవు పలికారు.


Updated : 26 Jan 2024 4:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top