Home > తెలంగాణ > సిద్ధిపేటకు అవార్డు.. ప్రభుత్వం అభినందించకపోవడం సిగ్గుచేటు : Harish Rao

సిద్ధిపేటకు అవార్డు.. ప్రభుత్వం అభినందించకపోవడం సిగ్గుచేటు : Harish Rao

సిద్ధిపేటకు అవార్డు.. ప్రభుత్వం అభినందించకపోవడం సిగ్గుచేటు : Harish Rao
X

సిద్ధిపేట మున్సిపాలిటీకి క్లీన్ సిటీ అవార్డు వచ్చింది. దీనిపై ఎమ్మెల్యే హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను ఘనంగా సన్మానించారు. క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా అవార్డు సిద్దిపేటకు రావడం గర్వకారణమన్నారు. ఇందుకు కృషి చేసిన కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం లేనిది.. అనుకున్న లక్ష్యం నెరవేరడం కష్టమన్నారు. ఈ అవార్డు సిద్దిపేట ప్రజలకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. సిద్ధిపేటను శుద్దిపేటగా నిలబెట్టిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపాలిటీ కార్మికులు ప్రజలకు రోగాలు రాకుండా కాపాడే సామాజిక వైద్యులని హరీష్ రావు అన్నారు. ప్రజల్లో మార్పు రావడం వెనక అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉందన్నారు.

రాష్ట్రం ఒకే ఒక్క జాతీయ అవార్డును సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలుపకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీలకు, అత్యుత్తమ పట్టణాలకు అవార్డులు ఇస్తున్నారంటే.. అందులో సిద్దిపేట పేరు ఉండాల్సిందేనన్నారు. అవార్డు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే అవార్డు అనే స్థాయికి ఎదిగిందని చెప్పారు. 22 జాతీయ అవార్డులను సాధించిన ఘనత సిద్దిపేటకే దక్కిందన్నారు. ఇది ఇలాగే కొనసాగాలి.. దేశంలోనే పరిశుభ్రమైన పట్టణం ఏది అంటే తెలంగాణలో ఉన్న సిద్దిపేట అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

Updated : 14 Jan 2024 1:37 PM IST
Tags:    
Next Story
Share it
Top