Home > తెలంగాణ > TS Assembly Elections 2023 : నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌.. నయవంచనకు మరోపేరు కాంగ్రెస్

TS Assembly Elections 2023 : నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌.. నయవంచనకు మరోపేరు కాంగ్రెస్

TS Assembly Elections 2023 : నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌.. నయవంచనకు మరోపేరు కాంగ్రెస్
X

సిద్దిపేట కీర్తిని ప్రపంచపటంలో నిలబెట్టిన గొప్ప నేత సీఎం కేసీఆర్‌ అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేటలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ.. నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీ అన్నిట్లో ముందుంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో ప్రకటనల్లో.. గెలుపులో ముందుంటుందన్నారు. ఈ మట్టిలోనే పుట్టిన మట్టి బిడ్డ కేసీఆర్ అడగకుండానే సిద్ధిపేటను జిల్లాగా ప్రకటించారని అన్నారు. రేపు జరగబోయే ఆశీర్వాద సభకు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలకాలని ప్రజలను కోరారు. సిరిసిల్ల సభను ముగించుకుని సాయంత్రం 4.45 గంటలు సిద్దిపేటకు సభకు వస్తారన్నారని తెలిపారు.

20వేల మంది విద్యార్థులు బైక్ ర్యాలీ ద్వారా స్వచ్ఛందంగా సభకు రానున్నారని చెప్పారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, లాయర్లు, డాక్టర్లు అందరూ ఈ సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోతో.. ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయని.. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే.. ప్రతిపక్షాల గుండెలు జారిపోయాయి. కేసీఆర్ తెలంగాణ ప్రజల కుటుంబ పెద్దలా ఆలోచించి.. మేనిఫెస్టోని తయారు చేశారని చెప్పారు. ఆసరా పెన్షన్, దళిత బంధు, రైతుబంధు, రైతుబీమా పథకాలను.. నగదు పెంచి పేర్లు మార్చి ప్రవేశపెడతున్నామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలను కాపీ కొట్టిందన్నారు. ఒకరిని కాపీ కొట్టే అవసరం కేసీఆర్ కు లేదని కేసీఆర్ తెలిపారు. నమ్మకానికి మారుపేరు కేసీఆర్‌ అయితే.. నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు.

Updated : 16 Oct 2023 9:34 PM IST
Tags:    
Next Story
Share it
Top