Home > తెలంగాణ > రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష : Harish Rao

రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష : Harish Rao

రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష : Harish Rao
X

బీఆర్ఎస్ ప్రస్థానంలో పూలబాటలు ఉన్నాయి.. ముళ్ల బాటలు ఉన్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. కేసీఆర్ లేకపోతే రేవంత్ ఎలా సీఎం అయ్యేవారని ప్రశ్నించారు. అటువంటి కేసీఆర్ను సంస్కారం లేకుండా దూషిస్తున్నారని మండిపడ్డారు. భద్రాచలంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భద్రాచలం చుట్టూ ఉన్న భూమిని కాంగ్రెస్, బీజేపీ ఆంధ్రాకు అప్పగించాయని ఆరోపించారు. 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రలో కలిపారని మండిపడ్డారు.

దేశంలోనే రేవంత్ అనాగరిక సీఎం అని హరీష్ రావు అన్నారు. రాహుల్ గాంధీ నీతి మాటలు మాట్లాడడం తర్వాత.. రేవంత్ రెడ్డికి నీతి గురించి చెప్పాలని హితవు పలికారు. రాష్ట్రపరువు తీసేలా సీఎం మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు అమలు చేస్తుందని అడిగారు. కాంగ్రెస్ 420 హామీలు అమలు అయ్యేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో వృద్ధులకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు డబ్బులు కూడా రాలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. రైతుబంధు ఫిబ్రవరి దాకా పడకపోవడం మార్పా? అని ప్రశ్నించారు. 6 లక్షల మంది ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ సర్కార్ రోడ్డున పడేశారని మండిపడ్డారు.

రేవంత్ ఫ్రస్టేషన్లో ఉన్నారని.. ఆయన రెచ్చగొట్టినా మేం రెచ్చపోం అని హరీష్ రావు అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో తాము ఇచ్చిన హామీలు అమలవుతాయని రేవంత్ చెప్పడం సిగ్గుచేటన్నారు. రాహుల్ ప్రధాని అవడం ఓ కల అన్నారు. కాంగ్రెస్ 40 సీట్లు గెలిస్తే ఎక్కువ అని మమతా బెనర్జీ అన్నారని గుర్తు చేశారు. ఇండియా కూటమికి నితీష్, మమత, కేజ్రీవాల్ దూరమయ్యారని.. కూటమి కుప్పకూలిందని ఎద్దేవా చేశారు. గల్లీ, ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ కోసం పోరాడేది ఒక బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు.

Updated : 3 Feb 2024 4:19 PM IST
Tags:    
Next Story
Share it
Top