Home > తెలంగాణ > పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దాం : హరీష్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దాం : హరీష్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దాం : హరీష్ రావు
X

మెదక్‌లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడం దురదృష్టరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్, హవేలీ ఘనపూర్ మండలాల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు గెలిచామన్న హరీష్.. మెదక్లో తక్కువ మెజార్టీతోనే ఓడిపోయామని చెప్పారు. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన గంటలో వారి ముందు ఉంటానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామన్నారు.

బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం, కొండపోచమ్మల ద్వారా మెదక్లో సాగు నీటి కష్టాలకు చెక్ పెట్టినట్లు హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలకులు ఎప్పుడైనా చెక్ డ్యామ్‌లు కట్టారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదని.. ప్రజలకు కేసీఆర్ అంటే నమ్మకం..బీఆర్ఎస్ అంటే విశ్వాసం అని చెప్పారు. రైతు బీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీది పేగే బంధమని చెప్పారు. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపిద్దామని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవడం పక్కా అని.. ఎవరు అధైర్యపడొద్దు..భవిష్యత్ మనదేన భరోసానిచ్చారు.

Updated : 27 Dec 2023 6:32 PM IST
Tags:    
Next Story
Share it
Top