Home > తెలంగాణ > మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే - హరీశ్‌ రావు

మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే - హరీశ్‌ రావు

మేం ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే - హరీశ్‌ రావు
X

సీఎం రేవంత్ రెడ్డి మొండి బకాయిల విషయంలో చేసిన కామెంట్లపై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. విద్యుత్ శ్వేతపత్రంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సిద్ధిపేట, గజ్వేల్, పాతబస్తీపై ముఖ్యమంత్రి అక్కసు వెళ్లగక్కారని అన్నారు. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలవలేదనే రేవంత్ ఆరోపణలు చేశారని విమర్శించారు. సిద్ధిపేట, గజ్వేల్లో ప్రజలు కరెంటు బిల్లులు కట్టలేదనడం అవాస్తవం హరీశ్ స్పష్టం చేశారు.

గతంలో కాంగ్రెస్తో పొత్తుపైనా హరీశ్ రావు మాట్లాడారు. తెలంగాణ ఇస్తామని అంటేనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నామని, జై తెలంగాణ అంటేనే టీడీపీతో కలిశామని స్పష్టం చేశారు. తాము ఎవరితో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమేనని చెప్పారు. సీఎం రేవంత్ మాత్రం పదవుల కోసమే పార్టీలు మారారని హరీశ్ విమర్శించారు.




Updated : 21 Dec 2023 5:37 PM IST
Tags:    
Next Story
Share it
Top