Home > తెలంగాణ > బ్యాట్ పట్టరాని మీ అబ్బాయికి.. బీసీసీఐలో పదవి ఎట్లొచ్చింది: హరీష్ రావు

బ్యాట్ పట్టరాని మీ అబ్బాయికి.. బీసీసీఐలో పదవి ఎట్లొచ్చింది: హరీష్ రావు

బ్యాట్ పట్టరాని మీ అబ్బాయికి.. బీసీసీఐలో పదవి ఎట్లొచ్చింది: హరీష్ రావు
X

కేంద్ర మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఖమ్మంలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. కల్వకుంట్ల కుటుంబ పాలనపై మండిపడ్డారు. దీనికి కౌంటర్ వేసిన హరీష్ రావు అమిత్ షా కుటుంబ పాలనపై మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఫైర్ అయ్యారు. బ్యాట్ పట్టడం చేతకాని అమిత్ షా కొడుకు జైషాకు.. బీసీసీఐలో కీలక పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని అన్నారు. 2జీ, 3 జీ, 4 జీ కాదు.. రాబోయే ఎలక్షన్స్ లో మీరంతా (బీజేపీ నాయకులు) మాజీలవుతారని చెప్పుకొచ్చారు.

సీఎం పదవి కాదు కదా.. ఎమ్మెల్యేగా సింగిల్ డిజిట్ సీట్లు కూడా ఆ పార్టీకి రావని చెప్పారు. తమ పార్టీకి నూకలు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లాయని ఎద్దేవా చేశారు. అబద్ధపు విమర్శలు, అవుట్ డేటెడ్ ఆరోపణలు, రాసిచ్చిన స్క్రిప్ట్ తో ఖమ్మంలో హోంమంత్రి స్కిట్ చేశారంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజీపడని యోధుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.




Updated : 27 Aug 2023 10:16 PM IST
Tags:    
Next Story
Share it
Top