Home > తెలంగాణ > మోదీ.. జాకీలు పెట్టి లేపినా, బీజేపీ గెలవదు: హరీష్ రావు

మోదీ.. జాకీలు పెట్టి లేపినా, బీజేపీ గెలవదు: హరీష్ రావు

మోదీ.. జాకీలు పెట్టి లేపినా, బీజేపీ గెలవదు: హరీష్ రావు
X

మహబూబ్ నగర్ జిల్లాలో మోదీ పర్యటించి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్పందించిన హరీష్ రావు ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ చేసేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలన అంటేనే కష్టాలు, కన్నీళ్లని విమర్శించారు. మోదీ తెలంగాణకు వచ్చి జాకీలు పెట్టి లేపినా బీజేపీకి డిపాజిట్ లు కూడా రావని అన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టో రాబోతుందని చెప్పుకొచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన హరీష్.. మోదీపై విమర్శలు గుప్పించారు.

గిరిజన యూనివర్సిటీపై స్పందించిన హరీష్.. 9 ఏళ్ల నుంచి గిరిజన వర్సిటీకి బీజేపీ అడ్డుపడిందన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటుచేయాలని విభజన చట్టంలో ఉన్నా.. బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. యూనివర్సిటీని కొత్తగా మోదీ ఇస్తున్నది ఏం లేదని, ఐదేళ్ల క్రితం కూడా ఇవే మాటలు చెప్పి మోసం చేశారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమని చెప్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు. ట్రిబ్యునల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీలు ఏమయ్యాయో చెప్పాలని మోదీని కోరారు. కేంద్ర సహకరించకపోయినా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టామని, అప్పట్లో డాక్టర్ సీటు రాక.. విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకున్నారని గుర్తుచేశారు. కేసీఆర్ 9 ఏండ్లలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్థాపించారన్నారు.


Updated : 1 Oct 2023 7:03 PM IST
Tags:    
Next Story
Share it
Top