Home > తెలంగాణ > Harish Rao: అభ్యర్థుల్ని ఖరారు చేయలేని స్థితిలో కాంగ్రెస్ - హరీష్ రావు

Harish Rao: అభ్యర్థుల్ని ఖరారు చేయలేని స్థితిలో కాంగ్రెస్ - హరీష్ రావు

Harish Rao: అభ్యర్థుల్ని ఖరారు చేయలేని స్థితిలో కాంగ్రెస్ - హరీష్ రావు
X

హుస్నాబాద్ ప్రజలపై ఉన్న ప్రేమ, నమ్మకంతోనే సీఎం కేసీఆర్ అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. అక్టోబర్ 15న నిర్వహించే బీఆర్ఎస్ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. గత ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్ ఈసారి కూడా ఈ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారని అన్నారు. హుస్నాబాద్ అంటేనే లక్ష్మి కటాక్ష నియోజకవర్గమని అంతా మంచే జరగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.

ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గోబెల్స్ ప్రచారాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటని మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించి 50 రోజులైనా కాంగ్రెస్ కనీసం ఫస్ట్ లిస్టు అనౌన్స్ చేసే పరిస్థితిలో లేదని అన్నారు. మాటలు, డబ్బు మూటలు, కర్ఫ్యూలు, మతకల్లోలాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్.. ముఠా రాజకీయాల కారణంగా ఢిల్లీలో టికెట్ల పంచాయితీ నడుస్తోందని విమర్శించారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో ప్రత్యేక రాష్ట్ర అంశాన్ని పెట్టి ఎంతో మంది తెలంగాణ ప్రజల చావుకి కాంగ్రెస్ పార్టీ కారణమైందని హరీష్ రావు మండిపడ్డారు.

కేసీఆర్ పాలనలో హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్న ఆయన.. 8 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని హరీష్ అన్నారు. నీళ్లు వస్తే ప్రతి ఒక్కరూ సంతోషిస్తే ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ బాబు ఉండటం అదృష్టమని అన్నారు. అక్టోబర్ 15న కేసీఆర్ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవడం ఖాయమని హరీష్ రావు అన్నారు. 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రశంసించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ హుస్నాబాద్కు తరలివచ్చి కేసీఆర్ సభను సక్సెస్ చేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు.

Updated : 10 Oct 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top