విషమంగానే తమ్మినేని ఆరోగ్యం.. పరామర్శించిన హరీష్ రావు
X
గుండెపోటుకు గురైన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తమ్మినేని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని.. నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కాగా ఆస్పత్రిలో తమ్మినేనిని మాజీ మంత్రి హరీష్ రావు పరామార్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. తమ్మినేని త్వరగా కోలుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు.
కాగా ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలోని నివాసంలో ఉండగా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఏఐజీకి తరలించారు. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్ధతు ప్రకటించారు.