Home > తెలంగాణ > Rajgopal Reddy : హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇస్తాం రాజగోపాలరెడ్డి కామెంట్స్

Rajgopal Reddy : హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇస్తాం రాజగోపాలరెడ్డి కామెంట్స్

Rajgopal Reddy : హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇస్తాం రాజగోపాలరెడ్డి కామెంట్స్
X

అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావుకు ప్రయోజనం లేదని..ఆయన 25 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వస్తే దేవదాయ శాఖ ఇస్తామని రాజగోపాలరెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హొదా లేకుండా చేశారు అని ఇప్పుడు పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని రాజగోపాలరెడ్డి తెలిపారు. తాము హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా జీ హుజూర్ అనే బ్యాచ్ కాదని, వారు మమ్మల్ని చీల్చాలని చూస్తున్నారని.. తాము పదవుల కోసం కాకుండా ప్రజల కోసం ఉన్నామన్నారు. ఇకనైన బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని.. అలాగే తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని.. రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని.. 13న జరిగే చలో నల్లగొండ సభ ఫ్లాప్ అవుతుందని. మీడియా చిట్ చాట్‌లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.

ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ నడపటం కేటీఆర్ వల్ల కావటం లేదని అన్నారు హరీశ్ రావు మాత్రమే కష్టపడుతున్నారని చెప్పారు.తాము పదవుల కోసం కాదని.. ప్రజల కోసం ఉండేవాళ్లమని తెలిపారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని హితవు పలికారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తమపై పడిందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే పార్టీని నడపాలని సవాల్ విసిరారు. నల్గొండ సభ అట్టర్ ప్లాప్ అవుతుందని అన్నారు. ఆ సభకు ప్రజలు రారని.. కార్యకర్తలు మాత్రమే వస్తారని తెలిపారు. బీఆర్ఎస్‌ను ఇంటి బాట పట్టించినందుకే కేసీఆర్ పోరుబాట పట్టారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను పజలు అసహ్యించు కుంటున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు

Updated : 12 Feb 2024 7:23 PM IST
Tags:    
Next Story
Share it
Top