Home > తెలంగాణ > కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. జనాలను వెర్రోళ్లను చేసిన బాలిక

కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. జనాలను వెర్రోళ్లను చేసిన బాలిక

కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. జనాలను వెర్రోళ్లను చేసిన బాలిక
X

రెండ్రోజుల క్రితం రాత్రివేళ కిడ్నాపర్‌ల నుంచి తప్పించుకొని హయత్‌నగర్ రోడ్డు పైకి వచ్చిన బాలికను..ఓ హిజ్రా కాపాడిందనే వార్త విన్నాం. ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి, పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా వారి నుంచి బయటపడ్డానని ఆ హిజ్రాకు చెప్పక.. ఆమె ఆ బాలికను రక్షించి పోలీసులకు అప్పగించింది. ఇక పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. జరిగిన అసలు నిజం తెలుసుకొని అవాక్కయ్యారు. ఆ బాలిక నుంచి అసలు విషయం బయటకు రాగా.. కిడ్నాప్ కేసు అంతా కట్టుకథేనని తేల్చారు.

ఆ బాలికకు కొద్ది రోజుల కిందట సోషల్ మీడియాలో అరవింద్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ చాటింగ్‌లు చేసుకుంటూ.. ఫొటోలు కూడా పంపించుకున్నారు. చాటింగ్, ఫోన్ కాల్స్ కాస్త ముదిరి... ఇద్దరు బయట కలుసుకోవాలనుకున్నారు. అనుకున్నట్టుగానే.. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక ఇంటినుంచి బయటికి వచ్చింది. బాలిక ఇంటి సమీపంలోనే ఆమెను రిసీవ్ చేసుకుని, బైక్ మీద ఇద్దరు కలసి... ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరున్న నిర్మానుష ప్రాంతంలోకి వెళ్లారు. కాగా.. అప్పటికే అక్కడ ఓ హిజ్రా ఉంది. ఆ హిజ్రాను చూసి బయపడిన బాలిక.. అరవింద్‌తో కలిసి బయటకు వచ్చేసింది. హిజ్రాకు అరవింద్‌తో వెళ్లిన విషయం తెలుస్తుందన్న బాలిక... అప్పటికప్పుడు ఓ ఖతర్నాక్ డ్రామాకు తెరలేపింది. అరవింద్‌ను అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పి, తనలో ఉన్న మహానటిని మేల్కొలిపింది.





అక్కడున్న హిజ్రా చూసేలాగా పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఇక్కడి తీసుకొచ్చారని.. పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే.. ప్రతిఘటించి తప్పించుకుని వచ్చానని తనకు హెల్ప్ చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి.. పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్లు వచ్చే వరకు ఆమెకు ధైర్యం చెప్పి.. వచ్చాక వాళ్లకు అప్పగించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. ఏం జరిగిందని క్షుణ్ణంగా అడిగేసరికి.. అసలు విషయం బయటపడింది.




Updated : 7 July 2023 9:18 AM IST
Tags:    
Next Story
Share it
Top