Home > తెలంగాణ > డీహెచ్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు ఫోన్.. క్లారిటీ ఇది

డీహెచ్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు ఫోన్.. క్లారిటీ ఇది

డీహెచ్ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు ఫోన్.. క్లారిటీ ఇది
X

ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ను మంత్రి హరీష్‌రావు హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసిన హరీష్‌.. రాజకీయ ప్రకటనలు మానుకోవాలంటూ వార్నింగ్‌ ఇచ్చినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించారు డీహెచ్ శ్రీనివాస్. తనకు ఫోన్‌ చేసి మంత్రి క్లాస్ తీసుకున్నారనేది పూర్తిగా అవాస్తవమని చెప్పారు. డాక్టర్ జీఎస్‌ఆర్ ట్రస్ట్ (GSR Trust) సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం కొత్తగూడెంలోనే ఉన్నానని తెలిపారు. అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు గడప గడపకు గడల కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో గిట్టని వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజలు, మీడియా మిత్రులు ఆ ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా కొత్తగూడెంలో డా.జీఎస్‌ఆర్ ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గారి స్పూర్తితో ముందుకెళ్తామని చెప్పారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.



Updated : 21 Aug 2023 1:23 PM IST
Tags:    
Next Story
Share it
Top