అన్నం తిన్నాక స్వీట్ తినాలనిపిస్తే.. ఇలా చేయండి.. హెల్త్కు మంచిది
X
పండగల సీజన్ వచ్చేసింది. ఈ నెల నుంచి వరుసగా పండుగలు ఉంటాయి. వీటి కోసం రుచి కరమైన ఆహార పదార్థాలు, స్వీట్స్ తయారుచేసుకుంటారు. ఈ క్రమంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా.. అవి తినకుండా ఉండలేరు కొంతమంది. ఫలితం.. డైట్ కంట్రోల్ తప్పి, ఫిట్ నెస్ కోల్పోయి.. బెల్లి ఫ్యాట్, ఉబ్బరం, మలబద్ధకం లాంటివి వస్తాయి. ముఖ్యంగా పండుగల టైంలో షుగర్ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.
చాలామందికి అన్నం తిన్న తర్వాత స్వీట్స్ తినే అలవాటుంటుంది. ఫంక్షన్స్ లో కూడా అదే ఫాలో అవుతారు. ఈ అలవాటు మార్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే.. మనం రోజూ తినే అన్నంలో సహజంగానే చక్కెర (కార్బోహైడ్రేట్స్) శాతం అధికంగా ఉంటుంది. ఇక స్వీట్స్ దేంతో చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నం తినగానే స్వీట్స్ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగిపోతాయి. అందుకే అన్నం తిన్న వెంటనే స్వీట్ తినడం వద్దంటున్నారు. స్వీట్ తినాలని మరీ అనిపిస్తే.. భోజనం చేశాక రెండు గంటలు గ్యాప్ ఇచ్చి స్వీట్ తినాలి. లేదా స్వీట్ తిన్నాక ఒక గంట వరకు అన్నం తినకూడదు. లేదంటే చిన్న డార్క్ చాక్లెట్ ముక్క లేదా బెల్లం ముక్క తినడం వల్ల స్వీట్ తినాలనే కోరిక తీరిపోతుంది. అంతేకాదు డార్క్ చాక్లెట్, బెల్లం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.