కేసీఆర్ ఆస్పత్రి ఖర్చులన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది.. హెల్త్ మినిస్టర్
X
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనారోగ్యం కారణంగా గత ఎనిమిది రోజులుగా రోజులుగా సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా.. కేసీఆర్ ఈరోజు డిశ్ఛార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ ఆస్పత్రి ఖర్చులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ప్రకటన చేశారు. కేసీఆర్‌కు వైద్య ఖర్చులన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.గురువారం అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. మాజీ సీఎం అనారోగ్య పాలవడం దురదృష్టకరమని, ఆయన ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక ఆఫీసర్‌ను కూడా నియమించామన్నారు. కేసీఆర్ హెల్త్ బిల్లులన్నీ తమ ప్రభుత్వమే ఇస్తుందన్నారు.
కేసీఆర్ ప్రమాద వశాత్తు జారిపడగా.. ఆయన తుంటి ఎముకకు గాయం కాగా.. హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు వైద్యులు. అయితే.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవటానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. కాగా.. ఈ ఎనిమిది రోజులు వైద్యులు.. కేసీఆర్‌ను 24 గంటల పాటు జాగ్రత్తగా పర్యవేక్షించారు. కేసీఆర్ చాలా తొందరగా కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారు. దీంతో.. ఈరోజు కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తున్నారు. నందినగర్‌లో ఉన్న కేసీఆర్ పాత ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు.