తెలంగాణ వ్యాప్తంగా ‘నీలోఫర్’లాంటి వైద్య సేవలు: మంత్రి హరీశ్ రావు
X
తెలంగాణ వ్యాప్తంగా నీలోఫర్ ఆస్పత్రిలో అందించిన వైద్యసేవలు పొందవచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం నీలోఫర్ ఆసుపత్రిలో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ..రాష్ట్రంలో శిశుమరణాలు పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ రంగంలో రూ.2కోట్లతో ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీని ద్వారా శిశువు జన్మించిన ఆసుపత్రి నుంచే నీలోఫర్‌లో అందిస్తున్న వైద్యసేవలు పొందవచ్చని వివరించారు. నీలోఫర్ ఆస్పత్రిలో ఉన్న నిపుణలైన డాక్టర్లు వర్చువల్ విధానంలో తమ సేవలను అందిస్తారని తెలిపారు. నీలోఫర్‌లో వెంటిలేటర్ల కొరత ఉందని, మరో 100 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తామని.. దేశం మొత్తం మీద 1200 పడకలతో తల్లి శిశు సంక్షేమ వార్డు ఒక్క నీలోఫర్ ఆసుపత్రిలో మాత్రమే ఉందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రులు..కార్పోరేట్ ఆస్పత్రులకు ధీటుగా పోటీపడుతున్నాయన్నారు హరీష్ రావు. బిడ్డ పుట్టక ముందు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్, బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రానున్నరోజుల్లో రూ.10 కోట్లతో 33 జిల్లాల్లో చిన్న పిల్లల అంబులెన్స్‌లు ప్రారంభిస్తామని చెప్పారు. గవర్నమెంట్ సెక్టార్‌లో మదర్ కేర్ కోసం ప్రత్యేకంగా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకువస్తున్నట్లు తెలియజేశారు. గవర్నమెంట్ సెక్టార్‌లో మదర్ కేర్ కోసం ప్రత్యేకంగా 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తీసుకువస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.