Home > తెలంగాణ > హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం
X

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌కు కూడా అంతరాయం ఏర్పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, పంజాగుట్ట, మాదాపూర్‌, పంజాగుట్ట, దుండిగల్‌, బహదూర్‌పల్లి, కోఠి, అబిడ్స్‌, బేగంబజార్‌, నాంపల్లి, బషీర్‌బాగ్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపుల్‌, హిమాయత్‌నగర్‌, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఓయూ క్యాంపస్‌, జీడిమెట్ల, కొంపల్లి, సురారం, షాపూర్‌నగర్, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, జగద్గిరిగుట్ట, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, చిక్కడపల్లి, తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్ఎంసీ నగరవాసులను అలర్ట్ చేసింది. మరో 24 గంటలు భారీ వర్షాలు పడే అవకాశముందని.. ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది. అత్యవసరమైతే డీఆర్‌ఎఫ్ బృందాల సహాయం కోరకు 040-29555500కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.

Updated : 24 Jun 2023 10:37 PM IST
Tags:    
Next Story
Share it
Top