హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
X
హైదరాబాద్లో మరోసారి వర్షం దంచికొట్టింది. పగలంతా గ్యాప్ ఇచ్చిన వాన రాత్రి మస్త్ కొట్టింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమవ్వగా.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, సూరారం, బహదూర్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, బాలానగర్,తిరుమలగిరి, ఆల్వాల్, జవహర్‌నగర్, ప్యాట్నీ, ప్యారరడైజ్, బేగంపేట్, రాంనగర్, దోమలగూడ, కవాడీ గూడ, ఇందిరాపార్క్, సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాయదుర్గం, కూకట్‌పల్లి, బేగంపేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు స్లోగా కదలడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ అల్పపీడన ఇవాళ బలహీనపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది.