Home > తెలంగాణ > హైదరాబాద్లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం..

హైదరాబాద్లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం..

హైదరాబాద్లో భారీ వర్షం.. భారీగా ట్రాఫిక్ జాం..
X

"హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది". మధ్యాహ్నం వరకు జనం ఉక్కపోతతో అల్లాడిపోయారు. అయితే మధ్యాహ్నం 2గంటల ఆ తర్వాత వెదర్ పూర్తిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. భారీ వాన కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.

జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. మెహదీపట్నం, లక్డికాపూల్, కోఠి, దిల్సుఖ్ నగర్, బేగంబజార్, చార్మినార్, రాణిగంజ్, ప్యాట్నీ, ప్యారడైజ్, సుచిత్ర, జీడిమెట్ల, చింతల్, బాల్ నగర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోనూ వాన పడుతోంది.

రోడ్లపై వర్షపు నీరు చేరడంతో పలు చోట్ల ట్రాఫిక్ జాం అయింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated : 25 Sept 2023 3:26 PM IST
Tags:    
Next Story
Share it
Top