హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..
X
హైదరాబాద్లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, బేగంపేట్, ప్యాట్నీ, పారడైజ్, చిలకలగూడ, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, అబిడ్స్, కోఠి, బేగం బజార్, సుల్తాన్ బజార్, నాంపల్లి, బషీర్‌బాగ్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, పాతబస్తీలోని తదితర ప్రాంతాల్లో మోస్తరు వాన కురుస్తోంది. కాలేజీలు, ఆఫీసుల నుంచి ఇంటికొచ్చే సమయం కావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.
మంగళవారం ఉదయం వరకు వర్షాలు పడతాయని వాతావారణ శాఖ ప్రకటించింది. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని చెప్పింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే నీరు నిలిచిపోయింది. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ జాం అయ్యే అవకాశముంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు హైదరాబాద్ వాసులను జీహెఎంసీ అప్రమత్తం చేసింది. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని సూచించింది. సహాయక చర్యల కోసం 040 21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని అధికారులు ప్రకటించారు.