పెరుగుతున్న వరద ఉద్ధృతి..వణుకు పుట్టిస్తోన్న కడెం ప్రాజెక్టు..
X
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని ఖడెం ప్రాజెక్ట్ మరోసారి వణుకు పుట్టిస్తోంది. ప్రాజెక్టుకు వరద భారీ ఎత్తున పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో డ్యాం పై నుంచి వరద ఓవర్ ఫ్లో అవుతోంది. దీంతో ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇప్పటికే అధికారులు 14 గేట్ల ద్వారా 2.4 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద పోటెత్తడంతో అప్రమత్తమైన అధికారులు 12 గ్రామాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కడెం ప్రజలను వారి ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
కడెం ప్రాజెక్ట్ కెపాసిటీ 3.50 లక్షల క్యూసెక్కులు. అయితే ప్రస్తుతం ఎగువ నుంచి వరద ఉద్ధృతంగా వస్తుండటంతో 6.04 లక్షలకు చేరింది. డ్యాం కెపాసిటీకి మించి వరద రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టుకు మోత్తం 18 గేట్లు ఉండగా.. అందులో 14 గేట్లను అధికారులు తెరిచారు. కానీ మరో నాలుగు గేట్లు తెరుచుకుకోకుండా మొరాయిస్తున్నాయి. వరద తీరు ఇదే స్థాయిలో కొనసాగితే ముప్పు తప్పదన్న భయం స్థానికుల్లో నెలకొంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.