Home > తెలంగాణ > తెలంగాణలో మళ్లీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన
X

తెలంగాణను వర్షాలు వీడడం లేదు. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత రెండు , మూడు రోజుల నుంచి వాన కాస్త గ్యాప్ ఇవ్వడంతో ప్రజలు కొంచెం రిలీఫ్ అయ్యారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.

ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్,మహబూబ్‌నగర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, నారాయణ్ పేటతో సహా పలు జిల్లాల్లో వర్షం పడుతుందని చెప్పింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40కిలోమీటర్లతో ఈదురు గాలులు వీస్తాయని వివరించింది.

అదేవిధంగా రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా భారీ వర్షాలతో అస్తవ్యస్తమైన జనజీవనం ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటుంది. ఇప్పుడు మళ్లీ వానలు పడుతాయన్న ప్రకటనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వంటి ప్రాంతాల్లో వరద మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ వానలు పడితే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వారు భయపడుతున్నారు.



Updated : 5 Aug 2023 1:27 PM IST
Tags:    
Next Story
Share it
Top