Home > తెలంగాణ > తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..

తెలంగాణలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..
X

తెలంగాణలో మరో మూడు రోజులు వానలు దంచికొట్టనున్నాయి. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా.. దానికి అనుబంధంగా 7.6కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాలైన సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ చేసింది. ఇక ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గురువారం కూడా పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బషీర్ బాగ్, ఎంజే మార్కెట్, ట్యాంక్ బండ్, సరూర్ నగర్ మిని ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.


Updated : 29 Sep 2023 4:18 PM GMT
Tags:    
Next Story
Share it
Top