Home > తెలంగాణ > హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. మరో మూడు రోజులు..

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. మరో మూడు రోజులు..

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన.. మరో మూడు రోజులు..
X

హైదరాబాద్లో భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి,లక్డికాపూల్ సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమవ్వగా.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులు, స్కూళ్ల నుంచి ఇంటికి వెళలే టైం కావడంతో పలుచోట్ల భారీ ట్రాఫిక్ జాం అయ్యింది.

ఇక వచ్చే మూడురోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ్టి నుంచి శనివారం వరకు ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనానికి తోడు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీన్ని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Updated : 27 Sept 2023 5:42 PM IST
Tags:    
Next Story
Share it
Top