బిగ్ బ్రేకింగ్.. విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు
ఇవాళ, రేపు సెలవు
X
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మంత్రి సబితా రెడ్డి ఇవాళ, రేపు సెలవులు ప్రకటించారు. గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులూ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం గురు, శుక్రవారాలు రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చింది. భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ(IMD) జూలై 20 , 21, 2023 తేదీలలో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.