రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు
X
రాష్ట్రాన్ని వరుణుడు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం గురువారం సాయంత్రం ఆగిపోయింది. అయితే తెల్లవారుజాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మళ్లీ షురువైంది. కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టా, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్, కొండాపూర్, ఏఎస్ రావు నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇవాళ కూడా హైదరాబాద్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కుసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
ఇదిలా ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడిందని, ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ పరిసరాల్లో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజులు అతి భారీ నుంచి అత్యంత భారీ వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. శుక్రవారం నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీచేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.