Home > తెలంగాణ > హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. మరో 6 గంటలు భారీ వర్షం

హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. మరో 6 గంటలు భారీ వర్షం

హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. మరో 6 గంటలు భారీ వర్షం
X

హైదరాబాద్‌లో (Hyderabad) మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 6 గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ (Red Alert) జారీచేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ (GHMC) అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్‌ (DRF) సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది.



ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ సూచించారు. ఇక రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు (Hussain Sagar) భారీగా వరద వచ్చే అవకాశం ఉన్నది. దీంతో ట్యాంక్‌బండ్‌లో వాటర్‌ లెవల్స్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేస్తున్నందున మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు. ఏదైన సమస్య ఉంటే తక్షణ సాయం కోసం GHMC హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040- 2111 1111, డయల్‌ 100, ఈవీడీఎం కంట్రోల్‌ రూం నంబర్‌ 9000113667లకు సంప్రదించాలన్నారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని ప్రజలకు సూచించారు. కాగా హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం కురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మెహదీపట్నం, టోలీచౌకి, షేక్ పేట్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అంసెబ్లీ, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్‌, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, సికింద్రబాద్, ఉప్పల్, తార్నాక, రామంతాపూర్‌తో పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడుతోంది. దీంతో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది. ఇప్పటికే సహాయక చర్యలకు డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. కాగా, అర్ధరాత్రి నుంచి వర్షం పడుతుడంతో ఎక్కడికక్కడ రోడ్లమీద వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫక్ జామ్ అయింది.




Updated : 5 Sept 2023 8:43 AM IST
Tags:    
Next Story
Share it
Top