Home > తెలంగాణ > ఉప్పొంగిన పెన్ గంగ.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

ఉప్పొంగిన పెన్ గంగ.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

ఉప్పొంగిన పెన్ గంగ.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్
X

గత నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్‌లో జన జీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జిల్లాకు ఉత్తరాన ఉన్న పెన్‌గంగా, దక్షిణాన ప్రవహించే గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జైనథ్‌ మండలం డొలారా వద్ద పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్‌ గంగ ప్రవాహం 50 అడుగుల ఎత్తులో ఉన్న వంతెనను తాకింది. దీంతో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని 44వ నంబరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరద ఉద్ధృతి తగ్గాక రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి డొలారా వంతెన వద్ద పెన్‌గంగ ఉద్ధృతిని పరిశీలించి పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్లే వాహనాలను జైనథ్ మండలంలోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

NH44పై నిన్నటి నుండే వాహనాల రాకపోకలను నిలిపివేశారు. డొల్లార వద్ద అంతరాష్ట్ర వంతెనలను తాకుతూ పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలో గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఇన్ ఫ్లో 4 లక్షల 80 వేల క్యూసెక్కులుగా ఉంది. చెనక కోరాట బ్యారేజ్ వద్ద పెన్ గంగా నిండుగా ప్రవహిస్తోంది. చెనాక కోరాట పంప్ హౌస్ జలదిగ్భందంలో చిక్కుకుంది. పిప్పర్ వాడ టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలిపివేశారు. మహారాష్ట్ర వైపు పిప్పల్ కోటి వద్ద వాహనాల ఆపివేశారు. NH44 మూసివేసినందున పెన్ గంగా ప్రవాహం తగ్గే వరకు హైవే పైకి రావొద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. NH44 హైవేపై నిన్న రాత్రి నుండి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పెన్ గంగా పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి బ్యాక్ వాటర్ చేరుతోంది.



Updated : 23 July 2023 4:48 AM GMT
Tags:    
Next Story
Share it
Top