Home > తెలంగాణ > ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో సీటు..డబ్బుల్లేక దళిత విద్యార్థిని అవస్థ

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో సీటు..డబ్బుల్లేక దళిత విద్యార్థిని అవస్థ

ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో సీటు..డబ్బుల్లేక దళిత విద్యార్థిని అవస్థ
X

ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో సీటు సాధించినప్పటికీ , ఫీజు కట్టేంత స్తోమత లేకపోవడంతో సతమతమవుతోందీ తెలంగాణకు చెందిన దళిత విద్యార్థిని ఉప్పులేటి జాహ్నవి. జర్నలిజంలో డిగ్రీ, సోషియాలజీలో పీజీ పట్టా పొందిన జాహ్నవి, ప్రముఖ జాతీయ,అంతర్జాతీయ పత్రికలకు పరిశోధనాత్మక వ్యాసాలు, కథనాలు రాసింది. ఉన్నత విద్యను అభ్యసించిన జాహ్నవికి పరిశోధనల మీద మక్కువ ఏర్పడింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది. గత ఏడాది ఇంగ్లాండ్‎లోని ఎడింబర యూనివర్సిటీలో సీటు వచినప్పటికీ సమయానికి ఫండింగ్ లభించలేదు. ఈ సారి ఎడింబరా వర్సిటీతో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ‎లో కూడా సీట్ వచ్చింది. కానీ రీసర్చ్‎కు అవసరమైన ఫండింగ్, స్కాలర్ షిప్ లభించకపోవడంతో ఈసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో కొంత మంది మిత్రులు ప్రొఫెసర్‎ల ప్రోత్సాహంతో ఆన్లైన్‎లో మిలాప్ యాప్ ద్వారా తన రీసెర్చ్‎కు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతోంది. జాహ్నవికి ఆర్థిక సహాయం లభిస్తే ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో PHD చేయబోయే తొలి దళిత విద్యార్థిని అవుతుంది.

మిలాప్ యాప్‏లో జాహ్నవి ఓ లెటర్‎ను పోస్ట్ చేసింది. అందులో తన చదువుకు సంబంధించిన విషయాలతో పాటు PHD కోసం అయ్యే ఖర్చుకు సంబంధించిన వివరాలను, ఆక్స్‌ఫర్డ్ నుంచి వచ్చిన లెటర్‎ను షేర్ చేసింది. "ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకోవడం ఒక గౌరవం. ఆ అవకాశం నాకు వచ్చింది. కానీ ఆర్థిక సహాయం లేకుండా నేను నా చదువును కొనసాగించడం అసాధ్యం. నా సీటును కాపాడుకోవడానికి 7 జూలై 2023లోపు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి నేను ఫైనాన్షియల్ డిక్లరేషన్‎ను సమర్పించాలి. నా మొత్తం పరిశోధనకు అయ్యే ఖర్చు రూ.49లక్షలు. నాకు ఈ విషయంలో సహాయం అందిస్తే నేను ఎంతో కృతజ్ఞురాలిని అవుతాను" అని జాహ్నవి విజ్ఞప్తి చేసింది.

Plz Click Here To Donate Jahnavi

⇓⇓⇓




Updated : 1 July 2023 1:23 PM IST
Tags:    
Next Story
Share it
Top