మాజీ సీఎం కేసీఆర్కు హీరో నాగార్జున పరామర్శ
X
తుంటి ఆపరేషన్ తో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బుధవారం రాత్రి హీరో నాగార్జున పరామర్శించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు, డాక్టర్లను కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. కేసీఆర్ ను ఆ స్థితిలో చూసి బాధేసిందని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని హీరో నాగార్జున ఆకాంక్షించారు. ఇక తనను పరామర్శించడానికి వచ్చిన నాగార్జునతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్.
కాగా ఈ నెల 7న ఎర్రవెల్లిలోని తన ఫాంహౌజ్ కాలు జారి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో కేసీఆర్ తుంటి విరగ్గా.. ఈ నెల 9న యశోదా ఆసుపత్రిలో ఆయనకు హిప్ రిప్లేస్ మెంట్ ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, హీరో చిరంజీవి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు కేసీఆర్ ను పరామర్శించారు.
tollywood,hero,Nagarjuna,former CM,KCR,Yashoda Hospital,cm revanth reddy,hip replacement,santhosh rao