సీఎం కేసీఆర్ను కలిసిన శర్వానంద్.. మ్యాటర్ ఏంటంటే..?
X
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల జైపూర్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. అక్కడి లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా రెడ్డి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ పెళ్లికి పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అయితే.. హైదరాబాద్ లో రేపు (జూన్ 9) ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసి.. దానికి ప్రముఖులను ఆహ్వానించాడు శర్వానంద్. అందులో భాగంగా ఇవాళ (జూన్ 8) శర్వానంద్ సీఎం కేసీఆర్ ను ప్రగతిభవన్ లో కలిశాడు. తన పెళ్లి రిసెప్షన్ కు హాజరుకావాలని సీఎంను శర్వానంద్ ఆహ్వానించాడు. శర్వానంద్ కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్.. రిసెప్షన్ కు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. కాగా, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు.. రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. బొజ్జల, కేసీఆర్ గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు.
కేసీఆర్ కు శర్వానంద్ పెళ్లి ఇన్విటేషన్ #cmkcr #sharwanand #reception #y... https://t.co/V20IPKa06L via @YouTube
— Mictv News (@MictvNews) June 8, 2023