ఫార్మాసిటీ భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు
X
తెలంగాణలో ఫార్మాసిటీ భూసేకరణకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. యాచారం మండలం మేడిపల్లిలో భూసేకరణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేసింది. మేడిపల్లి, కుర్మద్దలో భూసేకరణ పరిహారం ఉత్తర్వులను కొట్టివేసిది. ఈ విషయంలో అధికారుల తీరుపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ఫార్మాసిటీ భూసేకరణ విషయంలో అధికారుల తీరు ఆశ్చర్యంగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ ఇచ్చిన మెమోను పక్కన పెట్టిన అధికారులు కోర్టుల్లో కేసులు దాఖలయ్యాకైనా ఎందుకు తేరుకోవడం లేదని ప్రశ్నించింది. తప్పులు కప్పిపుచ్చుకునే బదులు సవరించుకుంటే మంచిదని హితవు పలికింది.. అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా అని హైకోర్టు ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై స్పందించి ఉంటే మూడేళ్ల సమయం వృథా అయ్యేది కాదన్న న్యాయస్థానం... అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని భూసేకరణ మళ్లీ ప్రారంభించాలని తీర్పు చెప్పింది.
High court cancelled pharma city land acquicition notification