గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు
X
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై అనర్హత వేటు వేసింది. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న కేసుపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీచేయగా.. డీకే అరుణ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచారు.
గత నెలలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తప్పుడు వివరాలతో ఎన్నికల అఫిడవిట్‌ను సమర్పించినందుకు కోర్టు అనర్హత వేటు వేయడంతో పాటు రూ.5 లక్షల ఫైన్ విధించింది. జలగం వెంకట్రావ్ను ఎమ్మెల్యేగా ప్రకటించింది. అయితే వనమా సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ఆయనకు ఊరట దక్కింది.