Home > తెలంగాణ > ఆర్డీసీ ఎండీ సజ్జనార్కు కోర్టు ధిక్కరణ నోటీసులు

ఆర్డీసీ ఎండీ సజ్జనార్కు కోర్టు ధిక్కరణ నోటీసులు

ఆర్డీసీ ఎండీ సజ్జనార్కు కోర్టు ధిక్కరణ నోటీసులు
X

ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోవడంతో సజ్జనార్‌ తోపాటు చీఫ్‌ మేనేజర్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీకి బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. కానీ తమ ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సజ్జనార్, ఆర్టీసీ చీఫ్ మేనేజర్కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.





ఉద్యోగుల క్రెడిట్‌ సొసైటీకి రూ.639 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. 2 నెలల్లో 200 కోట్లు చెల్లించాలంటూ గత నవంబరులో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రూ.44 కోట్లు చెల్లించామని, నెలకు రూ.10 కోట్లు చొప్పున ఆగస్టు వరకు చెల్లిస్తామని ఈ ఏడాది ఏప్రిల్‌ 26న హైకోర్టుకు ఆర్టీసీ తెలిపింది. అయితే పిటిషనర్‌ కోరిక మేరకు మే 15 లోపు రూ.50 కోట్లు, తరువాత నవంబరు నుంచి ఆరు నెలల్లోగా మిగిలిన రూ.100 కోట్లు చెల్లించాలని అదేరోజు హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఆర్టీసీ అమలు చేయకపోవడంతో పిటిషనర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.





Updated : 2 July 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top