Home > తెలంగాణ > టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌పై హైకోర్టు లాయర్‌ సంచలన ఆరోపణలు

టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌పై హైకోర్టు లాయర్‌ సంచలన ఆరోపణలు

టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌పై హైకోర్టు లాయర్‌ సంచలన ఆరోపణలు
X

టీఎస్పీఎస్సీసీ ఛైర్మన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించి.. బోర్డు ప్రక్షాళనలో తన వంతు మార్క్ చూపిస్తున్న మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు వినవస్తున్నాయి. డీజీపీగా ఉన్న సమయంలో మహేందర్ రెడ్డి అక్రమంగా లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను కూడపెట్టారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కి , ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ మేరకు ఆయన 14 పేజీల నోటీసును సిద్ధం చేసి, మహేందర్ రెడ్డి చేసిన అక్రమాలను వివరిస్తూ ఆధారాలతో సహా పొందుపరిచారు.మంగళవారం సైదాబాద్ డివిజన్ కళ్యాణ్ నగర్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాపోలు భాస్కర్ ఈ వివరాలు వెల్లడించారు.

పోలీస్ డిపార్మెంట్‌ని మహేందర్ రెడ్డి అక్రమాలకు వాడుకుంటూ ఎన్నో అసాంఘిక చర్యలు చేసి డబ్బులు సంపాదించాడని లేఖలో పేర్కొన్నాడు. భూ కబ్జాలు చేసే వారితో అతను చేతులు కలిపి ఎన్నో భూములను తన పేరు మీదకు వాటా రాయించుకున్నాడని తెలిపారు. అలా అతను చేసిన అక్రమార్జన కి సంబంధించిన వివరాలు తన వద్ద ఆధారాలతో సహా ఉన్నాయని అంటున్నారు. అతని క్రింద హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ ఇలా అన్నీ తెలంగాణ జిల్లాలో పని చేసే కొంతమంది పోలీసులు ఉన్నారని, వాళ్ళని ఈయన తన అక్రమ పనులకు వాడుకునేవాడని భాస్కర్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి.. తన ప్రతిష్టను దెబ్బ తీయడానికే కొంతమంది ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోలీసు శాఖలో 36 సంవత్సరాలపాటు అంకిత భావంతో విధులను నిర్వర్తించినట్టు పేర్కొన్నారు. తన సర్వీస్​లో ఏ చిన్న పొరపాటు కూడా దొర్లకుండా చూసుకున్నట్టు తెలిపారు. తాజాగా టీఎస్పీఎస్సీ ఛైర్మన్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కొందరు కావాలని తన ప్రతిష్టను దెబ్బ తీసే లక్ష్యంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సోషల్​మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారితో పాటు వాటిని ప్రచారం చేస్తున్న వారిపై క్రిమినల్ ​డిఫమేషన్ ​కేసులు వేయనున్నట్టు తెలియచేశారు.

Updated : 6 Feb 2024 4:15 PM GMT
Tags:    
Next Story
Share it
Top