దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు
X
ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ ఇటీవల చెప్పాపెట్టకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఎన్నికల్లో ఓటర్లను దానం నాగేందర్ ప్రలోభపెట్టారని కోర్టుకు చెప్పారు. డబ్బులు పంచడంతో పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయ్నారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో చేర్చలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా తదుపరి విచారణను వచ్చే నెల 18కి కోర్టు వాయిదా వేసింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.