Home > తెలంగాణ > Srinivas Goud : శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

Srinivas Goud : శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

Srinivas Goud  : శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
X

బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది. తనకు ప్రాణ హాని ఉందని 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలంటూ గతంలో శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆయన అభ్యర్థనను నిరాకరించింది. ప్రతి ఒక్కరికి ఈ విధంగా సెక్యూరిటీని కేటాయించడం సాధ్య పడదని.. ఈ సందర్భంగా హైకోర్టు చెప్పుకొచ్చింది. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ కు సెక్యూరిటీ అవసరమో లేదో.. చెప్పాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 19 కి వాయిదా వేసింది. శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు




Updated : 5 March 2024 1:35 PM IST
Tags:    
Next Story
Share it
Top