Home > తెలంగాణ > IPS Officers : ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై.. ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

IPS Officers : ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై.. ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు

IPS Officers : ఐఏఎస్‌ అధికారుల కేటాయింపుపై.. ఉత్తర్వులను కొట్టివేసిన హైకోర్టు
X

ఐఏఎస్ అధికారుల కేటాయింపుపై గతంలో క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను హైకోర్ట్ కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వం తిరిగి కేటాయింపులు జరిపే వరకు అధికారులు ప్రస్తుత విధుల్లో ఉన్న రాష్ట్రాల్లో కొనసాగాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిన వెంటనే.. దాన్ని రిలీవ్ చేయొద్దని అధికారులకు సూచించారు. కనీసం 15 రోజుల సమయం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని క్యాట్స్ హైకోర్టును కోరింది. కానీ దానికి ధర్మాసనం సముచితంగా నిరాకరించింది.

ఈ విషయంలో 13 మంది బ్యూరో క్రాట్లు క్యాడర్ కేటాయింపు అంశంలో కేంద్రానికి అభ్యర్థించాలని చెప్పింది. అధికారులు 10 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ చేసిన విషయాన్ని కేంద్రం పరిగణంలోకి తీసుకోవాలని చెప్పింది. ఒక్కొక్క అధికారి అభ్యర్థనను విడివిడిగా వినాలని కేంద్రానికి సూచించింది. ఈ విషయంలో అధికారులు లీగల్ గా ముందుకు వెళ్లొచ్చని హైకోర్ట్ చెప్పింది. అధికారుల కేటాయింపు విషయంలో క్యాట్ ఎలాంటి హక్కు లేదని, ఈ విషయం కేవలం డీఓపీటీ పరిధిలోకి వస్తుందని తెలిపింది.

Updated : 3 Jan 2024 9:09 PM IST
Tags:    
Next Story
Share it
Top