Home > తెలంగాణ > కిషన్ రెడ్డి అరెస్ట్కు పోలీసుల యత్నం.. అడ్డుకున్న కార్యకర్తలు..

కిషన్ రెడ్డి అరెస్ట్కు పోలీసుల యత్నం.. అడ్డుకున్న కార్యకర్తలు..

కిషన్ రెడ్డి అరెస్ట్కు పోలీసుల యత్నం.. అడ్డుకున్న కార్యకర్తలు..
X

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ చేపట్టిన 24 గంటల నిరహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షకు సాయంత్రం 6గంటల వరకే పర్మిషన్ ఉందని.. వెంటనే వెళ్లిపోవాలని పోలీసులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి అరెస్టుకు పోలీసులు యత్నించగా కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రేపు ఉదయం 11గంటల వరకు దీక్ష చేస్తామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.





అంతకుముందు కేసీఆర్పై కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకై లక్షల మంది విద్యార్థుల బతుకులు ఆగమయ్యాయని అన్నారు. కేసీఆర్ చేతకానితనం వల్లే పేపర్స్ లీక్ అయ్యాయని ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగానే వ్యవహరిస్తోందని.. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా యువతను మోసం చేస్తోందని మండిపడ్డారు.నిరుద్యోగులకు పథకం ప్రకరమే సర్కార్ అన్యాయం చేస్తుందన్నారు.





కుంభకోణాలు మీరు చేసి కేసులు తమ మీద పెడతారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై పోరాడితే బండి సంజయ్‌పై కేసులు పెట్టారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారని విమర్శించారు. హామీలు ఇవ్వడం.. అవి నెరవేరచకుండా మోసం చేయడమే కేసీఆర్ నైజం అన్నారు. నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కేసీఆర్ కు చేతకాకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.


Updated : 13 Sept 2023 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top