Home > తెలంగాణ > ఏపీ పోలీసుల ఓవరాక్షన్.. నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద హై టెన్షన్..

ఏపీ పోలీసుల ఓవరాక్షన్.. నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద హై టెన్షన్..

ఏపీ పోలీసుల ఓవరాక్షన్.. నాగార్జునసాగర్‌ డ్యాం వద్ద హై టెన్షన్..
X

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చొరబడి డ్యామ్‌కు ముళ్లకంచెను ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్టు 26 గేట్లలో సగభాగమైన 13వ గేట్‌ వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసు శాఖకు చెందిన అధికారులు దాదాపు 500 మంది పోలీసు సిబ్బందితో సాగర్‌ ప్రాజెక్టు వద్దకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్పీఎఫ్‌ సిబ్బందిపై దాడి చేశారు. భద్రతా సిబ్బంది మొబైల్‌ ఫోన్లతో పాటు డ్యామ్‌ భద్రత కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. 13వ గేట్‌ వద్దకు చేరుకొని ముళ్ల కంచె ఏర్పాటు చేసి డ్యామ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద నెలకొన్న పరిస్థితి గురించి సమాచారం అందుకున్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి అక్కడకు చేరుకున్నారు. ఏపీ పోలీసులతో మాట్లాడారు. డ్యామ్‌కు సంబంధించి నిర్వహణ విషయం నీటి పారుదలకు సంబంధించినదని, ముళ్ల కంచెను తీసేయాలని ఏపీ పోలీసులకు సూచించారు. అయితే వారు ఖాతరు చేయకపోవడంతో ఆయన వెనుదిరిగారు. రాష్ట్ర విభజనలో భాగంగా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. ఇప్పటి వరకు నీటి విడుదల, డ్యామ్ భద్రతను తెలంగాణ ప్రభుత్వమే చూసుకుంటోంది.

Updated : 30 Nov 2023 9:41 AM IST
Tags:    
Next Story
Share it
Top